
వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ కు నల్గొండ జిల్లాలో 95 పోలింగ్ కేంద్రాలు, 2 ఆక్సీలరి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి ఉత్తర్వుల కాపీ అందిందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనుమతించిన పోలింగ్ కేంద్రాల జాబితాను అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో మండల తహసిల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు ఆమె వెల్లడించారు.