ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎలక్షన్ కమిషనర్ అబ్జర్వర్ రవిష్ గుప్తా

నవతెలంగాణ-ధర్మసాగర్
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎలక్షన్ కమిషనర్ అబ్జర్వర్ రవిస్ గుప్త ఐపిఎస్ సూచించారు. మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఎలక్షన్ జరిగే ప్రదేశాలను నిశితంగా అక్కడున్న మౌలిక వసతులను స్వయంగా పరిశీలించి, అక్కడ పరిస్థితులను చక్కదిగాలని ఎంపీడీవో జోహార్ రెడ్డికి కార్యక్రమంలో వారితోపాటు స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీధర్ రావు, ఎస్సై రాజు, ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.