అభ్యుదయ నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ- తిరుమలగిరి 

తిరుమలగిరి  మండల కేంద్రంలోనీ తాటిపాముల గ్రామంలో అభ్యుదయ యువజన సమాఖ్య  యూత్ ఆధ్వర్యంలో నూతన కమిటినీ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షుడిగా రేగుల మహేందర్, ఉపాధ్యక్షుడిగా పాలబిందెల ఉమేష్,కార్యదర్శిగా కారుపోతుల సంతోష్,సహాయ కార్యదర్శి ననుబాల బలరామ్, కోశాదికారిగా నక్క మహేష్, క్రీడా కార్యదర్శిగా కొల వేణు, సాంస్కృతిక ఇంచార్జిగా రషిద్,గౌరవ సలహాదారులుగా కారుపోతుల రాజ్ కుమార్ కొడిదల అంజి,నక్క నాగరాజు, పాక యాకన్న, కొడిదల రాజు, బేతు ప్రవీణ్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు రేగుల మహేందర్ మాట్లాడుతూ రాబోయే రోజులలో  యూత్ ని బలోపేతం చేయడానికి అందరిని కలుపుకుపోతూ అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తూ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అదేవిధంగా నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బోయపేల్లి కిషన్,కాకర్ల రమేష్,కోల మహేష్,దయా యాదవ్,రేగుల మహేష్,చెరుకు యాకస్వామి,కారుపోతుల శ్రీకాంత్, భూపతి రాజు,కారుపోతుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.