ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల కమిటీ ఎన్నిక

 

– నూతన అధ్యక్షునిగా మొకాళ్ళ వెంకటేష్ ఏకగ్రీవ ఎన్నిక

నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం క్రీడా ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోరగట్ల లక్ష్మణరావు లక్ష్మణరావు అధ్యక్షతన నూతన తుడుందెబ్బ మండల అధ్యక్షునిగా మోకాళ్ళ వెంకటేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మహిపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ యువతీ యువకులు ఆదివాసి చట్టాలను జీవోలను కాపాడుకోవడం కొరకు ఆదివాసి ఉద్యమాలలో పాల్గొనాలని కోరారు. ఆదివాసీ హక్కులు జీవోలు తెలుసుకోవాలంటే ఐటీడీఏ ద్వారా ఆదివాసీలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆదివాసీ యువతకు విద్యా, ఉపాధి, ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజ నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అడ్వైజర్ నల్లబోయిన లక్ష్మణరావు, జిల్లా ఉపాధ్యక్షులు చర్ప లక్ష్మీనారాయణ, పొదెం నాగేశ్వరరావు, గౌరబోయిన మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి పోడెం శోభన్, సహకార్య దర్శి పాయం కోటేష్, మల్లయ్య ప్రచార కార్యదర్శి అన్నబోయిన సమ్మయ్య, తుడుందెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.