అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్ ఆధ్వర్యంలో  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎన్నిక నిర్వహించారు.అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ గా నస్రిమ బేగం, కన్వీనర్ గా బద్రి మధుపాల్, సభ్యులుగా పత్రి నందిని (ఎస్సీ), మునిగంటి మౌనిక, గాజనబోయిన మమత, సుద్దపల్లి లత(ఎస్సీ), గణపురం సింధు, కట్ట విజయ, గోపు సంధ్య(ఎస్సీ), తమ్మల్ల లత, గుమ్ముల స్వప్న, పత్రి లత, జక్కుల రూప, కల్ల రాజేశ్వరి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు పాఠశాల తరఫున పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ   పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా పాటుపడతామన్నారు.విద్యార్థులు కూడా క్రమశిక్షణతో మంచిగా చదివి, మంచి గ్రేడ్లు సాధించడం ద్వారా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, దామోదర్, లక్ష్మీనరసయ్య, గణేష్, కల్పన, సతీష్, తదితరులు పాల్గొన్నారు.