ఎస్సి వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి కన్వీనర్ ముద్దమల్ల భార్గవ్, ఎస్సి వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి మండల కన్వీనర్ గా పసుల పోచయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు బుధవారం కొయ్యూరు లో మాట్లాడారు డిసెంబర్ 1న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగబోయే మాలల సింహ గర్జనకు మండలం నుంచి వేలాదిగా మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారుఅనంతరం మాలల సింహ గర్జన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్. మండల రాహుల్.గడ్డం ముత్తయ్య, పీక కిరణ్. మాజీ జెడ్పిటిసి కొండా రాజమ్మ,వేల్పుల లచ్చయ్య, సుంకే వెంకన్న,వేల్పుల మహేందర్,మేకల రవి, నారా రాజేష్, కొండ సమ్మయ్య పాల్గొన్నారు.