బీజేపీ పట్టణ నూతన కార్యవర్గం ను మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా పెర్కిట్ కు చెందిన దుగ్గి విజయ్ రాజేశ్వర్ లతో పాటు మరో ఐదుగురు, ప్రధాన కార్యదర్శిగా పో ల్కం వేణు ,పులి యుగేందర్ కార్యదర్శులుగా కాందేష ప్రశాంత్ తో పాటు మరో ఆరుగురు, కోశాధికారుగా ధన్పాల్ శివకుమార్, కార్యవర్గ సభ్యులుగా రాజు, శ్రీధర్, దేవేందర్ గంగాధర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు దుగ్గి విజయ్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి ,రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పట్టణ అధ్యక్షుడు ద్యాగ ఉదయ్ తదితరుల సూచనలు సలహాల మేరకు నిర్విరామ సేవలు చేస్తారని తెలిపారు.