
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకోన్నారు. ఈ ఎన్నికలలో మలహలరావు మండల్ 15 గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొని నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా.. చేల్కల రాజు, గౌరవాధ్యక్షులుగా జెల్లల శేఖర్ , ప్రధాన కార్యదర్శిగా వేల్పుల సరిత,, ఉపాధ్యక్షులుగా పగడాల ప్రసాద్, కోశాధికారిగా చల్ల ప్రవీణ్ కుమార్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా తొగరి సాయిచరణ్ ,కమిటీ సభ్యులుగా మారుపాక కుమారస్వామి, కర్ణకంటి నరేష్ , బంటు సమ్మరాజు ,మస్కుల భాస్కర్ ,సామల వెన్నెల ,అజ్మీర సునీత, పైడాకుల రమేష్ , బట్ట శివప్రసాద్ ,పెంచాల సతీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.