నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండల సిపిఐ(ఎం) పార్టీ నూతన కార్యదర్శిగా తిరిగి రెండోసారి గంగాదేవి సైదులు బుధవారం జరిగిన 8వ మండల మహాసభలో ఎన్నికయ్యారు. చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామానికి చెందిన గంగాదేవి సైదులు చిన్నప్పుడే బాల్య దశ నుంచే అమరజివీ కామ్రేడ్ కందాల రంగారెడ్డి ఉద్యమాలకు ఆకర్షితులై 1987లో సిపిఐ(ఎం) పార్టీలో సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంతకుముందు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలలో విద్యార్థుల సమస్యలపై గంగాదేవి సైదులు ఎన్నో కార్యక్రమాలు చేశారు. సిపిఐ(ఎం) మండల కమిటీ సభ్యులుగా మందోల్లగూడెం శాఖ కార్యదర్శిగా నిర్వహిస్తూ గ్రామంలో మండలంలో అనేక ఉద్యమాలు సైదులు నిర్వహించారు.2021 చౌటుప్పల్ మండలం దండ మల్కాపురం గ్రామంలో నిర్వహించిన 7వ మహాసభలో మొదటిసారిగా మండల కార్యదర్శిగా ఎన్నికై మళ్లీ రెండోసారిగా నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంగాదేవి సైదులు మాట్లాడుతూ సిపిఐ(ఎం) పార్టీని కందాల రంగారెడ్డి పగిల్ల రాంరెడ్డి బొరెం జనార్దన్ రెడ్డి ఆశయ సాధన కోసం చౌటుప్పల్ మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నీ ప్రతి గ్రామ గ్రామాన నా వంతు మరింత బలోపేతానికి కృషి చేస్తానని సైదులు అన్నారు. గడిచిన 3 సంవత్సరాల కాలంలో చౌటుప్పల్ మండలంలో ఏ పార్టీ చేయని ఉద్యమాలు సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యలో నిర్వహించానని సైదులు చెప్పారు. దండు మల్కాపురం గ్రామంలో కాందీసీకుల భూములపై,ధరణి భూ సమస్యలపై,రేషన్ కార్డులపై ఆర్డిఓ,ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా రాస్తారోకోలు నిర్వహించానని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం 8వ మండల మహాసభ నుంచే ప్రతి గ్రామ గ్రామాన సిపిఐ(ఎం) పార్టీ జెండాను తీసుకెళ్తానని ఆయన చెప్పారు. పార్టీ కార్యక్రమాల కోసం నా సొంత ఖర్చులతో పార్టీ ఉద్యమాల కోసం ఖర్చు చేస్తున్నానని, నిరంతరం మండల కేంద్రంలో ఉంటూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పార్టీ కోసం పని చేస్తానని గంగాదేవి సైదులు పేర్కొన్నారు.