ఎర్రవల్లి అంబేద్కర్‌ యువజన సంఘం కమిటీ ఎన్నిక

Election of Erravalli Ambedkar Yuvajan Sangam Committee– అధ్యక్షులుగా పి. రాములు, ప్రధాన కార్యదర్శి సిలారి గోపాల్‌
– అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపు
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
వికారాబాద్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలో అంబే ద్కర్‌ యువజన సంఘం కమిటీని మంగళవారం ఎన్ను కున్నారు. అధ్యక్షులుగా పి.రాములు, ప్రధాన కార్యదర్శిగా సిలారి గోపాల్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సంఘం నాయకులు టి.రామచందర్‌ మా ట్లాడుతూ అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం యువత న డుం బిగించాలని అన్నారు. వారి ఆశయాలు సాధించడం కోసం కృషి చేయాలన్నారు. మనకంటూ ప్రత్యేకత స్థానం సంపాదించుకొని జీవించాలని తెలిపారు. మహనీయులు చూపిన బాటలో నడవాలన్నారు. విలువైన విషయాలను నెమరు వేసుకుంటూ ముందుకెళ్లాలని యువతకు పిలుపు నిచ్చారు. అంబేద్కర్‌ యువజన సంఘాలు రాజకీయాల కతీతంగా ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. దళితుల ఐక్యత కోసం, దళితవాడలా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అప్పుడే యువజ న సంఘాలకు మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయం తిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ ఆశ యాలు కొనసాగించాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం యువ త కృషి చేసి, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను తిప్పికొట్టాలని అన్నారు.
నూతన కమిటీ: కమిటీ అధ్యక్షులుగా పులుమద్ది రాములు, ప్రధాన కార్యదర్శి సిలారి గోపాల్‌, ఉపాధ్యక్షులుగా వై.సతీష్‌, టీ. మహేందర్‌, కే.లక్ష్మయ్య, సహాయ కార్యదర్శులు వై. రాములు, కుమార్‌, కె.అజరు, ఎస్‌. రవీందర్‌, గేమ్స్‌ కార్యదర్శి శ్రీకాంత్‌, టి.అశోక్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ రంగని అశోక్‌, కమిటీ సభ్యులు కే.నర్సింలు, టి.విజరు కుమార్‌, టి.రవీందర్‌, ఏ.రాజు, టి.నరేష్‌, టి.తరుణ్‌, పి. కార్తీక్‌, ఎస్‌.నరేష్‌, టి. రాజు, పి. కృష్ణ, ఎస్‌.ప్రవీణ్‌ కుమా ర్‌, బి.అనిల్‌, ఆర్‌.అరవింద్‌, పి.భరత్‌, వై.దశరథ్‌, వై. అనిల్‌, పి.రాజేందర్‌, టి.యాదయ్య, టి.సుధాకర్‌, టి.సురేష్‌, కమిటీ సలహాదారుల పి.పెంటయ్య, టి.రామ్‌ చందర్‌, టీ.పవన్‌కుమార్‌, ఎస్‌.రామేశ్వర్‌, బి.రవీందర్‌, టి.గోపాల్‌, పి.సంజీవరావులను ఎన్నుకున్నారు.