ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అతిథి అధ్యాపకుల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు సోగల ప్రవీణ్ కుమార్, సయ్యద్ జావేద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాగా జిల్లాలో ఉన్న నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి అతిథి అధ్యాపకులు హాజరయ్యారు. అనంతరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఆర్. శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ.సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీ.రాహుల్, జిల్లా సహాయ కార్యదర్శిగా జీ.విద్యారాణి, జిల్లా కోశాధికారిగా బీ. ఆనందం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులకు సభ్యులు, పలువురు అభినందనలు తెలిపారు.