
నవతెలంగాణ -తాడ్వాయి : ఆది విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కొప్పుల రవి ని రెండవసారి ఎన్నికైనందుకు భోకే సమర్పించి, శాలువాలు కప్పి తుడుం దెబ్బ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచులు ఆదివారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సమస్యలపై విద్యార్థి సమస్యలపై విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. అందుకు ఆయన సేవలను గుర్తి ంచి రెండవసారి కూడా యేసు రాష్ట్ర అధ్యక్షులుగా పట్టం కట్టామని తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఏ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ అధ్యక్ష పదవి కట్టబెట్టిన ఆదివాసి సమాజానికి తుడుం దెబ్బ నాయకులు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నిరంతరం ఆదివాసి విద్యార్థుల గురించి ఆదివాసి సమాజం గురించి పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడారం సర్పంచు చిడం బాబురావు, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్, సిద్దబోయిన స్వామి, సమ్మక్క పూజారి, అరేం లచుపటేల్, పులశే బాలకృష్ణ, పోడెం శోభన్, కొప్పుల జగన్, నల్లేబోయిన లక్ష్మణ్ రావు, పాయం కోటి, ఆదివాసి మ్యూజియం అసిస్టెంట్స్ క్యూరేటర్ కుర్సం రవి తదితరులు పాల్గొన్నారు.