ఎంజీఏటీ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎంజీఏటీ
నూతన కార్యవర్గం ఎన్నిక– అధ్యక్ష, కార్యదర్శులుగా ప్రసాద్‌, రామారావు
హైదరాబాద్‌ : మాస్టర్స్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (ఎంజీఏటీ) సోమవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన వార్షిక సభ్య సమావేశంలో ఆఫీస్‌ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. చైర్మెన్‌గా బివిఎస్‌ రావు (వినరు) ఎన్నిక కాగా.. అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్‌, కార్యదర్శిగా రామారావు వ్యవహరించనున్నారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్‌, జరీనా సుల్తానాలు.. కోశాధికారిగా మోషిన్‌ అలీ రజ్వీ ఎన్నికయ్యారు.