మత్స్యసహకార సంఘం ముద్దెంగూడ గ్రామ కమిటీ ఎన్నిక

నవతెలంగాణ-షాబాద్‌
మత్స్యసహకార సంఘం ముద్దెంగూడ కమిటీని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. మంగళవారం షాబాద్‌లో ముదిరాజ్‌ భవన్‌లో రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి ఓంప్రకాష్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మత్స్యసహకార సంఘం అధ్యక్షులుగా కె.పాండు, గౌరవ అధ్యక్షులుగా ఎన్‌.మల్లేష్‌, ఉపాధ్యక్షులుగా ఎన్‌.రవి, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌.శ్రీశైలం, కోశాధికారిగా ఎన్‌.మల్లేష్‌, డైరెక్టర్లుగా బి. శ్రీశైలం, బి.దయాకర్‌, పి.రమేష్‌, కె.ప్రవీణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పాండు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ధన్య వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం మండల అధ్య క్షులు ఎన్‌. లింగం, గౌరవ అధ్యక్షులు కె. వెంకటయ్య. ప్రధానకార్యదర్శి పి. మాసయ్య, జిల్లా కార్యదర్శి పీపీ.జంగయ్య, సంఘం నాయకులు పి. నర్సింహులు, యాదగిరి, జనార్ధన్‌, మాసయ్య, పోచయ్య, యాదయ్య, సుధాకర్‌, సురేష్‌, రాంచంద్రయ్య, జంగయ్య, శేఖర్‌, తదితరులు ఉన్నారు.