ముదిరాజ్‌ సంఘం కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ-తుర్కయంజాల్‌
తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ (ఎన్‌ఎస్‌ఆర్‌ నగర్‌) ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఢిల్లీ జగదీశ్వర్‌ ముదిరాజ్‌, ఉపాధ్యక్షులుగా పళ్ళ వెంకటయ్య, జనరల్‌ సెక్రెటరీగా ఎడ్ల వెంకటేష్‌, జాయింట్‌ సెక్రటరిగా ఖమ్మం రమేష్‌, కోశాధికారిగా ఎడ్ల దానయ్య, ముఖ్య సలహాదారులుగా పిట్టల నరేష్‌, ఢిల్లీ పాండు, సభ్యులుగా గోదాసు నరేష్‌ , కానమని వెంకటేష్‌ , రెడ్డమోని సాయి కుమార్‌, చింతకాయల యాదగిరి, ధనమోని నరేష్‌, గడిగ యాదగిరి, కోర్ని శివ, పొలమోని సాయికిరణ్‌, పుల్లగాజుల నరేష్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఢిల్లీ జగదీశ్వర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ సంఘం అభివద్ధికి ఎల్లవేళలా కషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంఘ సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గోదాసు భద్రయ్య, రెడ్డమోని కోటయ్య, పూజారి నందీశ్వర్‌, ఢిల్లీ శ్రీనివాస్‌, చింతకాయల యాదయ్య, ఢిల్లీ నర్సింహ, ఖమ్మం విఠలేష్‌, పొలమోని రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.