తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా కార్యవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాల్వంచ పట్టణానికి చెందిన మొహమ్మద్ ముంతాజ్ అలీను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరు ప్రస్తుతం టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికకు గాను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన షేక్ రాజా సాహెబ్ (మైనార్టీ ఉద్యోగుల రాష్ట్ర కోఆర్డినేటర్) నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మహమ్మద్ ముంతాజ్ అలీ మాట్లాడుతూ… తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్, జిల్లా కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఉన్న మైనార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మైనారిటీ ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మైనార్టీ ఉద్యోగస్తులు మరియు రాష్ట్ర నాయకులు షేక్ సైదులు, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు షేక్ సాధిఖ్ పాష, జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ.యాకూబ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.