అయ్యప్ప ధర్మాప్రచార సభ జిల్లా అధ్యక్షులు గా ముత్యంరాజు ఎన్నిక..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అఖిల భారతీయ ధర్మ ప్రచార సభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా రంగు ముత్యంరాజు గురుస్వామినీ ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఏ బి ఏ పి జిల్లా సమావేశం శనివారం అయ్యప్ప స్వామి దేవాలయం లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కమిటీ నీ ఎన్నుకున్నారు.ఇట్టి ఎన్నికలకు జాతీయ కమిటీ సభ్యులు పరిశీలక్కలుగా వచ్చారు.సమక్షంలోనే ఎన్నికలు నిర్వహించారు.అధ్యక్షులు రంగు ముత్యంరాజు, ఉపాధ్యక్షలు గా కంచర్ల శేఖర్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి గా కొత్తగాట్టు యాదగిరి, కోశాధికారి గా మాశెట్టి నరేష్, పి ఆర్ ఓ గా సుంకాని శ్రీనివాస్, కామాండెంట్ గా పులుసు ఎల్లేష్ లు గా ఎన్నికైన్నారు. వారితో పాటు పదిమంది జిల్లా కమిటీ సభ్యులు గా ఎన్నుకోబడ్డారు. జిల్లా అధ్యక్షులు గా ఎన్నికైన ముత్యంరాజు గురుస్వామిని పలువురు అభినందించారు.