ఆకారంలో నూతన బూత్ కమిటీలు ఎన్నిక

నవతెలంగాణ-దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆకారంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నూతన బూత్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో 5వ బూత్ కన్వీనర్ బీమరి స్వామి, 6వ బూత్ కన్వీనర్ దమ్మన్నపేట పర్ష గౌడ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాస నాగభూషణం, ఎంపిటిసి లక్ష్మి నారాగౌడ్, ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, ఆకారం గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు పాక రాజు,బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు డప్పు శేఖర్, ఆకారం గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులు మర్కంటి నవీన్, ఆకారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.