– సంఘం నూతన కమిటీ ఎన్నిక
– అధ్యక్షులుగా గిరిపల్లి స్వామి, ప్రధాన కార్యదర్శిగా వెంకగళ్ల బాల్ నర్సింహ ఏకగ్రీవంగా ఎన్నిక
నవతెలంగాణ-శామీర్‌పేట
మూడు చింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామంలో ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గిరిపల్లి స్వామి, ఉపాధ్యక్షులుగా దండు రమేష్, ప్రధాన కార్యదర్శిగా వెంకగళ్ల బాలనర్సింహ కోశాధికారిగా నల్ల నాగేష్, సలహదారులుగా వి. కిష్టయ్య, ఎన్. పోచయ్య, వి. ఆంజనేయులు, గురువయ్య, వి. ఎల్లేష్, కార్యవర్గ సభ్యులుగా జి. రమేష్, బి. మహేష్, బి. సురేష్, డి. నరేందర్, జి. అశోక్, జి. ప్రేమ్ రాజ్, ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గిరిపల్లి స్వామి మాట్లాడుతూ.. అందరి సహకారంతో అంబేద్కర్ యువజన సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కషి చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా తపై నమ్మకంతో అంబేద్కర్ యువజన సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా కొల్తూరు గ్రామ బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు అమీరిశెట్టి శ్రీనివాస్ గుప్తా, అంబేద్కర్ యువజన సంఘం నూతన అధ్యక్షులు గిరిపల్లి స్వామిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.