పీఆర్టీయు మండల నూతన కమిటీ ఎన్నిక 

Election of new committee of PRTU mandalనవతెలంగాణ – పెద్దవంగర
పీఆర్టీయు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అవుతాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం పీఆర్టీయు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కమిటీ ఎన్నికకు జిల్లా అధ్యక్షుడు సంకా బద్రీనారాయణ, ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీష్ రెడ్డి, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మండల నూతన అధ్యక్షుడిగా గంగిశెట్టి రమేష్, ప్రధాన కార్యదర్శిగా వెలిదే సురేష్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా తాళ్ల పెళ్లి విద్యాసాగర్, మహిళా ఉపాధ్యక్షులుగా పల్లె రజిత, మహిళా కార్యదర్శిగా మాటేటి ఉమాదేవి, కార్యదర్శిగా కొలిపాక బాలరాజు ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు బద్రీ నారాయణ, సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యల పరిష్కారంలో పీఆర్టీయు కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. త్వరలోనే సర్వీస్ రూల్స్ సాధిస్తామని, 50 శాతం ఫిట్ మెంట్ పీఆర్సీని సాధిస్తామన్నారు. సీపీఎస్ వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల నూతన అధ్యక్ష కార్యదర్శులు రమేష్, సురేష్ కుమార్ మాట్లాడుతూ..పీఆర్టీయు బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. తమ నియామకానికి సహకరించిన జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళాధర్, ప్రభాకర్ రెడ్డి, బూసాని సోమయ్య, క్షీరసాగర్ రవి కుమార్, యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.