ఆదిలాబాద్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో కరాటే అసోసియేషన్ చైర్మన్ రవికాంత్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కాంబ్లె ముకేష్ కుమార్, ఉపాధ్యక్షులు సురేష్, కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి, హన్మాండ్లు, కోశాధికారి రాజు, ముఖ్య సలహాదారులు, ఎర్ల కృష్ణ, టెక్నికల్ చైర్మన్ ఆకాష్ పవార్, ప్రేమ్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికైన సభ్యులకు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు.