శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక 

నవతెలంగాణ – మాక్లూర్

మండల కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా  గ్రామ పెద్దలు, యువకులు,  ప్రముఖులు, పుర ప్రముఖులు అధ్వర్యంలో ఏకగ్రీవంగా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ  అధ్యక్షులు జి. సాయికుమార్, ఉపాధ్యక్షులు బేగారి భూషణ్, పురుషోత్తం గౌడ్,  కోశాధికారి ఎం వెంకటరమణ. ప్రధాన కార్యదర్శి కుడుకల రాజు, కార్యదర్శి శ్రావణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి బేగరి మనోహర్, సలహాదారులుగా మాసం రాజేశ్వర్, ఊరడి సందీప్ సలహాదారులుగా అజయ్ గౌడ్, దర్గల నరేష్,  హేమంత్, సభ్యులుగా కల్లెడ ప్రసాద్, కుమ్మరి శేఖర్, రాచర్ల రాములు, ఎన్నుకోవడం జరిగింది.  గ్రామపెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.