
ఎబీవీపీ తెలంగాణ యూనివర్శిటీ శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ యూనివర్సిటీల కన్వీనర్ జీవన్ హాజరై మాట్లాడారు అనంతరం తెలంగాణ యూనివర్సిటీ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో యూనివర్శిటీ అధ్యక్షులుగా సాయి కుమార్, కార్యదర్శిగా అమృత్ చారి లను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా, పావని, సింహాద్రి, తరుణ్, అనిల్, రాకేష్ లను ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు బచ్చనబోయిన శివ, ఇందూరు విభాగ్ సంఘటనా కార్యదర్శి రాజు సాగర్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగరాజు , ప్రమోద్, సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.