నూతన సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా మండల పరిధిలోని రేగులపల్లి గ్రామానికి చెందిన తిప్పారపు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కమిటీ సభ్యులుగా బొమ్మిడి సాయి కృష్ణ,సంగ ఎల్లయ్య,బండి చంద్రయ్య,బోనగిరి లింగం,ప్రభాకర్, మల్లేశం,తిరుపతి ఎన్నికయ్యారని మల్లారెడ్డి పేర్కొన్నారు.