బిసి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ -ఆర్మూర్    

తెలంగాణ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో బాల్కొండ మండల కేంద్రంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడమైనది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపకులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ అధ్యక్షతన బాల్కొండ మండల కేంద్రంలో సోమవారం నూతన కమిటీ నియమించడం జరిగింది.

ఈ సమావేశంలో అబ్బకు అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ఇతర పార్టీ నాయకులకు బీసీలు గుర్తుకొస్తారని బీసీల ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ జనాభా 57 శాతం కలిగినటువంటి బీసీలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 23 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం బీసీలను తక్కువ చేసి అవమానించినట్లెని తెలిపారు. బీసీల దమాష ప్రకారం వారికి బీసీ సీట్లను కేటాయించకపోవడం డిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అశోక్ గౌడ్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఐదు కులాలలో   ముఖ్యమైనటువంటి ముదిరాజ్ కులస్తులకు అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటు కూడ కేటాయించకపోవడం వెతిరేకిస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ కులాలలో మా మాదిగ సోదరులకు కూడా అసెంబ్లీ స్థానంలో ఒక్క సీటు కూడా కేటాయించక  పోవడం పట్ల బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని అబ్బ గోని అశోక్ గౌడ్ చేశారు.
    ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షులు దాసరి మూర్తి, బాల్కొండ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జట్టి జనార్ధన్, బాల్కొండ నియోజకవర్గం సెక్రటరీ రామనాథం, బాల్కొండ మండల అధ్యక్షులు మాసం గోపి, బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శిభీమ్గల్ మండల అధ్యక్షులు గంగారం, మెండోరా మహిళా అధ్యక్షురాలు కళావతి బాల్కొండ మండల ఉపాధ్యక్షులు గంగరాజుల రాజేందర్, మేదరిపోతూ శ్రీనివాస్, బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి షైనీ నాగేష్ బాల్కొండ పట్టణ అధ్యక్షులు వెంకటగిరి, బాల్కొండ పట్టణ ఉపాధ్యక్షులు ఆరేపల్లి సాయిలు, ప్రధాన కార్యదర్శి తోపారం నారాయణ, కోశాధికారి మండాజీ రమణ చారి, కార్యదర్శులు తోపారం నారాయణ, బండి మల్లేష్ యాదవ్, సలహాదారులు కటికె నారాయణ, కొత్తింటి సాయన్న, సుంకేట సురేష్ తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు.