
రాజంపేట్ మండలంలో కిరాణా వర్తక సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులుగా చంద్రమౌళి గుప్తా, ఉపాధ్యక్షులు రాజు, కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి వెంకట రాజేశ్వర్ గుప్తా, కార్యవర్గ సభ్యులు, ప్రవీణ్, పద్మారావు, అనిల్, శ్రీనివాస్, నర్సింలు, రాజు, నర్సింలు, ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.