లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్ను కున్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో లయన్స్ క్లబ్స్ ఇన్స్టాలేషన్ సెర్మని కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ ఫస్ట్ వీడి జి ఏ అమృత్ రావు సభ్యులతో ప్రమాణం చేయించారు.లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ అధ్యక్షుడిగా అందే వెంకటగిరి, కార్యదర్శిగా ద్యావతి పోశెట్టి,కోశాధికారిగా కటికే శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమములో ఐపి డిస్ట్రిక్ గవర్నర్ పి. లక్మి, రీజియన్ సెక్రటరీ నరసయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.