ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

నవతెలంగాణ – వేములవాడ
టియూడబ్ల్యూజే హెచ్ 143 వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ లయాక్ పాషా అధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రెస్  క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫిక్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య నేతృత్వంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులుగా తాహర్ పాషా,గుమ్మడి శ్రీనివాస్,సయ్యద్ లాయక్ పాషా,సయ్యద్ రసూల్,ఉపాధ్యక్షుడిగా సయ్యద్ అలీ,కొత్వాల్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా జితేందర్ రావు ,డిప్యూటీ జనరల్ సెక్రటరీగా మారుపాక శ్రీహరి,జాయింట్ సెక్రటరీగా కృష్ణారెడ్డి,సంటి రాజేందర్,ఆర్గనైజింగ్ సెక్రటరీగా విష్ణు,బోనాల రవి, క్యాషియర్ గా నేరెళ్ల కమలాకర్, ప్రచార కార్యదర్శిగా రియాజ్, అనిల్,కార్యవర్గ సభ్యులుగా జిల్లా రమేష్, రజనీకాంత్ ,పరశురాం, సంతోష్, రవి, ప్రవీణ్, శ్రీనివాస్, గంగాధర్, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.తమ నియమానికి సహకరించి తమకు భాద్యతలు అప్పగించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫిక్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య లకు సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.సంఘం బలోపేతానికి కృషి చేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో .. ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.