సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో శనివారం హిందూ వాహిని నూతన కమిటీని రాష్ట్ర సంపర్క్ సహసంయోజక్ కస్తూరి భూమి రెడ్డి, జిల్లా సహసమ్యోజక్ బండి కిరణ్ కుమార్, జిల్లా కార్యాలయ్ ప్రముఖ్ దొడ్ల శ్రీకాంత్ ఆద్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ హిందూ వాహిని గ్రామ అధ్యక్షునిగా ఎస్ రాకేష్, ప్రధాన కార్యదర్శులుగా కే మనోహర్, కార్యదర్శలుగా పి అరుణ్, కనకరాజు, కుమారస్వామి, దుబ్బాక మండల ప్రధాన కార్యదర్శిగా వన్నెల విజయ్ కుమార్ ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రవీందర్, అవినాష్, యాదగిరి, గ్రామ యువకులు తదితరులు ఉన్నారు.