నవతెలంగాణ-కాసిపేట
మండలంలోని సోమగూడెం కమ్యూనిటీ హాల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సభాధ్యక్షుడిగా చొప్పరి శ్రీహరి వ్యవహరించగా ముఖ్య అతిధులుగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి హాజరయ్యారు. కాసిపేట-1వ గని ఏఐటీియూసీ ఆధ్వర్యంలో మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా చొప్పరి శ్రీహరి, కార్యదర్శిగా శఘ్యం శంకరయ్య, సహాయ కార్యదర్శిగా జెట్టి ప్రశాంత్, ఏ రిలే ఇన్‌చార్జిగా బల్లెం శ్రీనివాస్, బీ రీలే ఇన్‌చార్జిగా దినేష్, సీ రిలే ఇన్‌చార్జ్జిగా ఉదరు మహేందర్, జనరల్ షిఫ్ట్ ఇన్‌చార్జిగా రాజు, వర్క్ మెన్ ఇన్స్‌పెక్టర్‌గా రంజిత్ కుమార్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి మీనుగు లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శి రాజేందర్, పార్వతి సురేష్, కమిటీ సభ్యులు లింగయ్య, మహేష్ పాల్గొన్నారు.