ట్రాక్టర్ అసోషియేషన్ నూతన అధ్యక్షుడి ఎన్నిక 

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ట్రాక్టర్ అసోషియేషన్ నూతన అధ్యక్షుడిగా మాజీ ఆలయ అభివృద్ది చైర్మన్ బండారీ రాములు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసోషయేషన్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువ కప్పి సన్మానించారు.