వేములవాడ రూరల్ హన్మాజీపేట గ్రామ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా అవునూరి శంకరయ్య, ఉపాధ్యక్షునిగా గసిగంటి దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆరెల్లి భూమయ్య, క్యాషియర్ గా ఆవునూరి బాబు, సహాయ కార్యదర్శి గా పసుల లక్ష్మీ రాజ్యం, కార్యవర్గ సభ్యులుగా గొర్రె రఘు, గసిగంటి హరీష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శంకరయ్య మాట్లాడుతూ తనను ఎన్నుకున్నటువంటి అంబేద్కర్ సంఘ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో సంఘ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.