సీపీఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శిగా పల్లెర్ల అంజయ్య ఎన్నిక..

Election of Pallerla Anjaiah as secretary of CPI(M) Bhuvanagiri mandal..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సీపీఐ(ఎం) భువనగిరి మండల కార్యదర్శిగా పల్లెర్ల అంజయ్యను శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో నిర్వహించిన సీపీఐ(ఎం) మండల 8వ మహాసభలో ఎన్నికైనారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ  తెలిపారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య మాట్లాడుతూ నిన్న నిర్వహించిన మండల మహాసభలో గత మూడు సంవత్సరాల నుండి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భువనగిరి మండల వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమాల గురించి చర్చించుకొని మండల వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని తెలియజేశారు. మహాసభలో బస్వాపురం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని, ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ నష్టపరిహారము వెంటనే చెల్లించి ఇండ్ల నిర్మాణానికి డబ్బులు వెంటనే ఇవ్వాలని, రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులందరికీ నష్టపరిహారము చెల్లించాలని, ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నా వారికి కూడా నష్టపరిహారము ఇవ్వాలని, ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం లేని పేదలందరికీ 150 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని అన్నారు. మండలంలోని గ్రామాల మధ్యన ఉన్న లింకు రోడ్లను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులను నడపాలని, అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్స్ ఇవ్వాలని, వడపర్తి కత్వను వెడల్పు చేసి  కత్వలోకి కాలేశ్వరం నీళ్లు తెచ్చి భువనగిరి చెరువు నింపి ఆ చెరువు ద్వారా అనాజిపురం చెరువుతోపాటు అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని అన్నారు. మూసి నీరుకు బదులు గోదావరి జిల్లాలు అందించాలని, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రకటించిన హామీలను అమలు చేయాలని తెలిపారు. మండలంలో ఉన్న భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి, ప్రభుత్వ మిగులు భూములను భూమిలేని పేదలకు పంచాలని మహాసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో ఈ తీర్మానాల అమలు కోసం ప్రజలను సమీకరించి ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రజా ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజలు సహకారాలు అందించాలని అంజయ్య తెలియజేసినారు. అనంతరం 14 మందితో నూతన మండల కమిటీని ఆరుగురితో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారని మండల కార్యదర్శి వర్గ సభ్యులుగా పల్లెర్ల అంజయ్య, దయ్యాల నరసింహ, ఏదునూరి మల్లేశం, అన్నంపట్ల కృష్ణ, కొండా అశోక్, కొండమడుగు నాగమణి, కమిటీ సభ్యులుగా సిలివేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, మోటె ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి, మధ్యపురం బాల్ నరసింహ, కళ్లెం లక్ష్మీనరసయ్య, బొల్లెపల్లి లీలా లు ఎన్నికయ్యారు.