
మండలంలోని పోసానిపేటలో వెలసిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన నూతన కార్యవర్గాన్ని గురువారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నా రెడ్డి మహిపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా బండి పోచయ్య, ఉపాధ్యక్షులుగా చిందం కృష్ణ, గాండ్ల రవి, సెక్రెటరీగా పోతుల పెద్ద భాస్కర్ రెడ్డి, కోశాధికారిగా చిదుర నరేష్ లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు శనిగారపు సాయిలు, ఉపాధ్యక్షులు ప్రవీణ్, కార్యదర్శి రాజు, కోశాధికారి నర్సింలు, భాస్కర్ రెడ్డి, నరేందర్, సాకలి తిరుపతి, రాజేందర్, బాపురెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.