నవతెలంగాణ -భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీ భిక్కనూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా బల్యాల సుదర్శన్ మరోసారి నియమితులయ్యారు. నియామక పత్రాన్ని మాజీమంత్రి షబ్బీర్ అలీ శనివారం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు మరోసారి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీకి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, టీపీసీసీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమ్ రెడ్డి, సీనియర్ నాయకులు లింబద్రి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.