చిత్తాపురం గౌడ సంఘం అధ్యక్షుడి ఎన్నిక

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని చిత్తాపురంలో గౌడ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించి సోమవారం సంఘం నూతన అధ్యక్షుడిగా కొంతం శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు భీమగాని మచ్చగిరి గౌడ్, కార్యదర్శి భీమగాని చంద్రయ్య గౌడ్, డైరెక్టర్లు శనగల వెంకటయ్య, కొంతం బిక్షపతి, భూపతి రాములు, నల్లబోలు సైదులు, కొంతం ఎల్లయ్య గౌడ్, కనకమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భముగా వారు గౌడ సంఘ అభివృద్ధికి  కృషి చేస్తామని అన్నారు.