ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

నవతెలంగాణ – సిరిసిల్ల
ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కుర్ర రాకేష్, మల్లారపు ప్రశాంత్ లని ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్ తెలిపారు. పట్టణంలో రెండు రోజులపాటు జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాలుగో మహాసభలు గురువారం ముగిసాయి. జిల్లా నలుమూలల నుండి దాదాపు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 15 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా జాలపల్లి మనోజ్, గుండెల్లి కళ్యాణ్, సహాయ కార్యదర్శిగా పెండేలా ఆదిత్య, సంజన లను ఎన్నుకున్నట్లు తెలిపారు.