
ఎస్ ఎఫ్ ఐ గర్ల్స్ సబ్ కమిటీ ఎన్నుకోవడం జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపిక తెలిపారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో ఎస్ఎఫ్ఐ నగర గర్ల్స్ సబ్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గర్ల్స్ కమిటీ రాష్ట్ర సభ్యురాలు దీపిక మాట్లాడుతూ.. విద్యార్థినులకు రక్షణ కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించే రకంగా ప్రభుత్వం చూడాలని, నగరంలో గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్ ల వద్ద ప్రొటెక్షన్ గా షీ టీం లను పర్యవేక్షణ చేస్తూ ఉండాలని, వారికి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్, అదే విధంగా సంక్షేమ హాస్టల్లో మెస్ కాస్మెటిక్ చార్జెస్ లను విడుదల చేయాలని అన్నారు. ప్రత్యేకంగా సంక్షేమ హాస్టల్లో అమ్మాయిలకి శానిటరీ నాప్కిన్స్ అందించే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో చూడాలని అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో మహిళ డిగ్రీ కాలేజ్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రకటించడం జరిగింది. గర్ల్స్ కన్వీనర్ గా సుమిత్ర, కో కన్వీనర్ గా సమ్రీన్ బేగం, కన్వినింగ్ కమిటీ సభ్యులుగా మేఘన, వీణ, చిన్ని పద్మ, వైష్ణవి, లత లను ఎన్నుకోవడం జరిగింది.