తెలంగాణ త్రోబాల్‌ సంఘం ఎన్నిక

Election of Telangana Throwball Associationహైదరాబాద్‌: ది తెలంగాణ త్రోబాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం శనివారం ఎన్నికైంది. యూసుఫ్‌గూడలోని వల్లాల గ్రౌండ్స్‌లో జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో వి నవీన్‌ యాదవ్‌, కిరణ్‌ చారి అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. వెంకట కోము కోశాధికారిగా ఎన్నికయ్యాడు. హైదరాబాద్‌ వేదికగా జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగుతాయని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం వెల్లడించింది. ఏజీఎంలో అసోసియేషన్‌ సభ్యులు, పది జిల్లాల ప్రతినిధులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.