
ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆదేశాల మేరకు సోమవారం టీఎన్జీవో కేంద్ర సంఘ కార్యాలయం, నాంపల్లి, హైదరాబాద్ లో నిజామాబాద్ టిఎన్జీవో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశము, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని సమక్షంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల కాళీ ఏర్పడిన టీఎన్జీవో జిల్లా అధ్యక్ష పదవిని కో ఆప్షన్ పద్ధతిన ఎన్నుకునేందుకు ఎంప్లాయిస్ జేేేఏసి జిల్లా చైర్మన్, టీజీవో అధ్యక్షులు అలుక కిషన్ సుదీర్ఘ అనుభవంతో కూడిన సూచనల మేరకు, సోమవారం టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీఎన్జీవో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ని టిఎన్జీవో జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా అంగీకరించి, కో ఆప్షన్ పద్ధతిన ఎన్నుకున్నారు. టీఎన్జీవో నియమావళి ప్రకారం జిల్లా సహాధ్యక్షులుగా ఉన్న పెద్దోళ్ల నాగరాజు, నూతన టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ని కో ఆప్షన్ పద్ధతిన ఎన్నుకుంటున్నట్టు ఉత్తర్వులు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అందజేశారు. కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని కో ఆప్షన్ నియామక పత్రాన్ని నూతనంగా ఎన్నికైన నాశెట్టి సుమన్ కుమార్ కు అందజేశారు. అనంతరం సుదీర్ఘ కాలం పాటు టీఎన్జీవో జిల్లా అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టి ఇటీవలే పదోన్నతి పై వెళ్తున్న సందర్భంగా, టీఎన్జీవో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఈరోజు టీజీవో జిల్లా అధ్యక్షులుగా కొనసాగింపబడుతున్న అలుక కిషన్ కి టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ హుసేని సమక్షంలో టీఎన్జీవో జిల్లా కార్యవర్గంచే ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, శాలువాతో ఘనంగా సన్మానించి, గజమాలతో సత్కరించి,జ్ఞాపికను అందజేశారు. టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా కార్యవర్గం పక్షాన జిల్లా నుండి ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.