
ఇండియన్ జర్నలిస్ట్సు యూనియన్ (ఐజెయు) అనుబంధ సంఘం అయిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్సు (టీయూడబ్ల్యూజే ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నిజామాబాద్ జిల్లా నుంచి బోబ్బిలి నర్సయ్య, ఎం.ఎ.మాజీద్, జి.ప్రమోద్‌గౌడ్‌లు ఎన్నిక అయ్యారని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి సిరిగాధ ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నిజామాబాద్ జిల్లాకు ముగ్గురికి అవకాశం కల్పించారు. ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన బోబ్బిలి నర్సయ్య, ఎం.ఎ. మాజీద్, జి.ప్రమోద్‌గౌడ్‌లను అభినందించారు. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏడ్ల సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి. అరవింద్ బాలాజీ, జిల్లా కోశాధికారి సిరిగాధ ప్రసాద్‌లు యూనియన్ జిల్లా కమిటీ తరుపున అభినందనలు తెలిపారు. యూనియన్ అభివృద్ది కోసం జిల్లా కమిటీకి పూర్తిగా సహకరించి, జిల్లా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర కమిటీలో జిల్లా సమస్యలపై స్పందించి చర్చించి పని చేయాలని కోరారు.