మండలంలోని చింతగూడ గ్రామ గల్ఫ్ సంక్షేమ సమితి కార్యవర్గాన్ని సంక్షేమ సమితి సభ్యులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఇమిడి సెట్టి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా కొండకూరి ప్రశాంత్, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్రేషియా ఇవ్వాలన్నారు.