
ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలంటే మృతుల ఓట్లు, వలస దారుల ఓట్లు తొలిగించి, తప్పు ఒప్పులు లేకుండా ఉండాలని,18 సంవత్సరాలు పై బడిన, అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటరుగా ఉండాలని అదనపు కలెక్టర్, నియోజకవర్గం ఎన్నికల అధికారి పి.రాంబాబు తెలిపారు. మండలంలోని ఊట్లపల్లి, నారాయణపురం పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేసారు. స్పెషల్ కాంపెయిన్ డే లలో భాగంగా 01.01.2024 నాటికీ 18 సంవత్సరాల వయస్సు నిండిన నూతన ఓటర్ల నుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ ను పరిశీలించారు.అలాగే చనిపోయిన ఓటర్ల కుటుంబ సభ్యుల నుండి ఫారం 7 దరఖాస్తు తీసుకొని వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించాలని ఆదేశించారు. తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ వి.కృష్ణ ప్రసాద్, ఉప తహసీల్దార్ రామ కృష్ణ, కృష్ణ, ఆర్.ఐ లు, బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.