పోలింగ్ నిర్వహణలో ఎన్నికల నియమావళి పాటించాలి

 – ఇ.ఆర్.ఒ, అదనపు కలెక్టర్ రాంబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట : రామన్న అసెంబ్లీ ఎన్నికల విధి నిర్వహణలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సంఘం నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధికారులు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్, అశ్వారావుపేట రిటర్నింగ్ ఆఫీసర్ డాక్టర్ పి.రాంబాబు అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన పోలింగ్ సిబ్బంది మొదటి దఫా శిక్షణా తరగతులు మంగళవారం తో ముగిశాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న మౌలిక సదుపాయాలు, ప్రజలు ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలని వివరించారు. ఎన్నికల అధికారులు ఓటర్లకు పూర్తిగా సహకరించి నూరు శాతం పోలింగ్ కోసం దృష్టి సాధించాలని చెప్పారు. వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎ.ఇ.ఆర్.ఒ, స్థానిక తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్, మండల నోడల్ ఆఫీసర్, ఎం.పి.డి.ఒ శ్రీనివాస్ రావు, పీ.వో లు, ఏ.పీ.వో లు పాల్గొన్నారు.