నవతెలంగాణ- కంటేశ్వర్: శాసనసభ సాధారణ ఎన్నికలు-2023 జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 పోలింగ్ రోజున, డిసెంబరు 3న కౌంటింగ్ రోజున సిటీ పోలీసు యాక్ట్ 1348 లోని సెక్షన్ 22(1)(ఏ) నుంచి (ఎఫ్), 22 (ఏ నుంచి ఇ), 22(3) ప్రకారం నిషేధ ఉత్త ర్వులు జారీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఎన్నికల సందర్భంగా నిషేధించిన పలు అంశాలను వెల్లడించారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో సమావేశం, ఊరేగింపు ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజ కీయ పార్టీ బ్యానర్లు/ లోగోలు ఉన్నా, లేకున్నా, ఇంకా ఏమైనా ఏర్పాటు చేయడం జరుగుతే చర్యలు తీసుకుంటామని,
రాజకీయ లేదా ఇతరులు జిల్లాలో ప్రచారం కోసం లేదా ఓటింగ్ కోసం మైకుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం, కల్లు, ఇతర మత్తు పదార్థాలు వినియోగించడం, మద్యం, కల్లు పంపిణీ వివిధ సంఘాలు లేదా వ్యక్తుల మధ్య మతపరమైన శత్రుత్వం, ద్వేషం సృష్టించడం, నేరానికి పాల్పడే అవకాశం ఉన్న చిత్రాలు, చిహ్నాలు, ప్లకార్డులు, ప్రసంగాలు చేసి గొడవలు సృష్టించడం జరుగుతే చర్యలు తప్పని,చట్టబద్ధమైన అధికారానికి భంగం కలి గించడం అన్ని పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అంతరాయం కలిగించడం వీడీసీలు, కుల పెద్దలు రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఓటర్లతో ప్రమాణం చేయించడం వంటివి జరిగితే ఎన్నికల కమిషన్ నియమనిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.