దేశంలో ప్రజాస్వామ్యానికి ఎంత దుర్గతి పట్టిందో.. త్రిపురలో జరిగిన మూడెంచల స్థానిక సంస్థల ఎన్నికలు విదితం చేస్తున్నాయి. 2019 నాటి మూడంచెల స్థానిక సంస్థల ఎన్నికలకూ, ఐదేండ్ల తరువాత జరిగిన ప్రస్తుత ఎన్నికలు ఏమాత్రం తీసిపోలేదు. అప్పుడూ ఇప్పుడూ అవే దుర్మార్గాలూ, దౌర్జన్యాలూ, కిడ్నాప్‌లూ, హత్యలూ బీజేపీ ఏలు బడిలో నిత్యకృత్యమయ్యాయి. పోటీలో గెలుపోట ముల సంగతి అలా ఉంచుదాం. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లనే వెయ్యనివ్వని ప్రజాస్వామ్య వ్యతిరేక దుష్ట సంస్కృతి త్రిపురలో 2019 ఎన్నికల నుంచి రాజ్యమేలుతోంది. ఈ ఆగస్టు 8న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వెల్లడవు తున్నాయి. త్రిపురలో 606 గ్రామ పంచాయతీలకు (మొదటి అంచెకు) సంబంధించి 6,370 సీట్లుండగా, నామినేషన్ల పరిశీలనానంతరం మూడో వంతు సీట్లలోనే ప్రత్యర్థి పార్టీలు పోటీ పడుతున్నా యని సుస్పష్టమైంది. అంటే నామినేషన్ల పరిశీలన పూర్తయ్యేటప్పటికి 6,370 స్థానాలకుగాను 4,349 స్థానాల్లో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా నామి నేషన్ వేయలేక పోయింది. కాషాయమూకలు బరితెగించి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకు న్నాయి. వెనక్కి తిరిగివెళ్లని వారిని గాయపరిచారు. పొడిచి చంపారు. ఈ ఎన్నికల్లో జిల్లా పరిషత్ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసిన సీపీఐ(ఎం) నాయకుణ్ణి పోలీసుల ఎదుటే హత్య చేశారు.
పోలీసుల ఎదుట నామినేషన్లు వేయాల్సిన దుస్థితి నెలకొంది. దాడులు, దౌర్జనాలు, నరమేధం సాగిస్తున్న బీజేపీపై వామపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా..నామినేషన్లను ఆ యా పంచాయతీల్లో కాకుండా పోలీసుల సమక్షంలో వేయాలని ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసుల సమక్షంలో నామినేషన్లు దాఖలు ప్రక్రియ మరింత హాస్యాస్పద మైంది. వేలాది స్థానాల్లో నామినేషన్లు వేయడానికి వెళ్లిన వామపక్షాల నాయకుల్ని అధికార పార్టీ మూకలు వెంటాడి దాడులు చేస్తుంటే పోలీసులు ఎక్కడా నిలువరించలేక పోయారు. పైగా నామి నేషన్లు వేయడానికి వస్తున్న వారిని తరిమి కొట్టారు. అందువల్లనే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మూడింట రెండొంతుల సీట్లు బీజేపీ ఖాతాలోకి చేరిపోయాయి. ప్రతిపక్ష పార్టీలైన సీపీఐ(ఎం), సీపీఐ తదితర వామపక్ష పార్టీల, కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసుల ఎదుట నామినేషన్లు వెయ్యనివ్వని కారణంగానే బీజేపీ మూడింట రెండొంతుల సీట్లు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 2,021 (మూడోవంతు) స్థానాలకే ఎన్నికలు జరిగాయి. ఈ అననుకూల పరిస్థితుల్లో సీపీఐ(ఎం), తదితర వామపక్షాల వారు దాడులు భర్తిస్తూనే, నెత్తురోడు తూనే వెళ్లి కొన్నిచోట్ల నామినేషన్లు వేయగలిగారు. ఆ ఎన్నికల ఫలితాలు మొన్న ప్రకటించారు. వాటిలో బీజేపీకి 1,598, సీపీఐ(ఎం)కు 150, కాంగ్రెస్‌కు 146, తిప్ర మోతా పార్టీకి 102 స్థానాలు వచ్చాయి. ఏకగ్రీవాలతో కలిపి బీజేపీకి 5,945 సీట్లు వచ్చాయి.
రెండో అంచె అయిన 35 పంచాయతీ సమితులకు సంబంధించి 423 స్థానాలకు బీజేపీ ఒక్క పార్టీయే అన్నింటికీ నామినేషన్లు వేసింది. ఇందులో సగం సీట్లలో ప్రతిపక్షాలను నామినేషన్లు వేయనివ్వలేదు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం 190 స్థానాలు బీజేపీ ఖాతాలో పడిపోయాయి (ఏకగ్రీవాలయ్యాయి). మిగతా 233 స్థానాలకు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 205, కాంగ్రెస్‌కు 8, సీపీఐ(ఎం) 7 స్థానాలు లభించాయి. ఏకగ్రీవాలతో కలిపి బీజేపీకి 405 స్థానాలు వచ్చాయి. మూడో అంచె అయిన 8 జిల్లా పరిషత్తులకు సంబంధించిన 116 స్థానాల్లో 114 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం గా గెలిచారు. మిగతా 114 స్థానాల్లో నామినేషన్లు వేయకుండా బీజేపీ చేసిన ప్రయత్నం విఫలం కావడానికి కారణం సీపీఐ(ఎం) అభ్యర్థి హత్యకు గురవ్వడమే. తమ మూకలు చేసిన ఈ హత్యతో బీజేపీ వెనుకంజ వేసింది. దానివల్ల ఈ అంచె ఎన్నికలకు ప్రతిపక్షాలు పోటీ చేయ డానికి పెద్దగా అడ్డంకులు ఏర్పడలేదు. అయినా ఎన్నికల ప్రచారాలు చేసుకోనివ్వ లేదు. వామపక్షాల కార్యకర్తలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. ఎన్నికలను బూటకం చేశారు. ఎన్నికలు జరిగిన 114 స్థానాలకు గాను బీజేపీకి 101, కాంగ్రెస్‌కు 2, సీపీఐ(ఎం)కు 1 వచ్చాయి. ఏకగ్రీ వాలతో కలిపి బీజేపీకి మొత్తం 113 స్థానాలు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్తెసరు మెజారిటీతో (రెండుసీట్ల ఆధిక్యంతో) విజయం సాధించిన బీజేపీ… తన అడుగుజారిందని గుర్తించింది. దీంతో 2019 నాటి పంచాయతీ ఎన్నికల అక్రమాల ఆయు ధాన్ని భుజాన వేసుకుంది. అప్పుడు మూడంచెల స్థానిక ఎన్నికల్లో 95 శాతం స్థానాలను బీజేపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగతా 5 శాతం ఇండిపెం డెంట్లకు, చిన్నా చితకా పార్టీలకు వచ్చాయి. ఎన్నికల అక్రమాలకు నిరసనగా ప్రతిపక్షాలు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా యి. అధికార పార్టీ మూకలు, గూండాలకు వత్తాసుగా ప్రభుత్వ అధికార యంత్రాం గం, పోలీసులు కూడా ఉండటంతో అధికార పార్టీకి ఆయాచితంగా సీట్లు వచ్చి పడిపోతున్నాయి. ఇలాంటి వ్యవహారంలో ఆరితేరి న పార్టీ బీజేపీ. దీన్ని మనం ప్రజాస్వామ్యమని ఎలా అనగలం?
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్