పోలింగ్ కేంద్రాలకు కదలిన ఎన్నికల సిబ్బంది

నవతెలంగాణ – మద్నూర్ 
జహీరాబాద్ పార్లమెంట్  ఎన్నికల సందర్భంగా సోమవారం నిర్వహించే పోలింగ్ కు ఎన్నికల సిబ్బంది మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర) నుండి ఎన్నికల సామాగ్రి వెంట తీసుకువెళ్ళారు. ఈరోజు(రేపు కూడా) ఎన్నికల విధులలో పాల్గొన్న సిబ్బంది వివరాలు:  పోలింగ్ కేంద్రాల్లో పాల్గొన్న సిబ్బంది 255 పోలింగ్ కేంద్రాలకు గాను 255×5=1275 మంది,  అదనంగా మరో 80 (రిజర్వ్) సిబ్బంది, 26 రూట్ లకు సెక్టారల్ ఆఫీసర్లు 26 మంది,  పోలింగ్ కేంద్రాలకు 255 మంది బూత్ లెవెల్ బి ఎల్ ఓ లు అధికారులు,  వారికి అసిస్టెంట్లుగా మరో 255 మంది ఏ బి ఎల్ ఓ  లు , హెల్త్ డిపార్ట్మెంట్ నుండి 185 మంది,  26 టేబుల్స్ కు 26 మంది ఏఈవోలు, 255 మంది పోలీసు సిబ్బంది, మద్నూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర భద్రతగా మరో 10 మంది పోలీస్ సిబ్బంది,  రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి (తాసిల్దార్ లు, డిప్యూటీ తాసిల్దార్లు, గిర్ధవర్లు, సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, చైన్మెన్లు ,  కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వీఆర్ఏలు, జీపీ సిబ్బంది, 200 మంది వరకు,  మొత్తం 2567 మంది పోలింగ్ సిబ్బంది జుక్కల్ నియోజకవర్గం లో ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యా