– పోలింగ్ సమయం 7 గంటలు నుండి సాయంత్రం 4 గంటలు వరకు మాత్రమే….
– తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట : పోలింగ్ తేదీ సమీపించి నందున ఎన్నికల నిర్వహణ సిబ్బంది నిఘా పెంచాలని,సెక్టార్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ వి.క్రిష్ణ ప్రసాద్ పోలింగ్ విధులు చేపట్టే సిబ్బంది కి సూచించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టార్ అధికారులతో శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తహశీల్దార్ మాట్లాడుతూ పోలింగ్ సమయం ఉదయం 7.00 నుండి సాయంత్రం 4.00 వరకు మాత్రమే అని, ప్రతి పోలింగ్ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలని, 11.05.2024 శనివారం సాయంత్రం 4.00 గంటలు నుండి ప్రచారానికి అనుమతులు ఉండవని, మద్యం దుకాణాలు ముసి వేయాలని,అదేవిదంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై నిఘా ఉంచాలని హెచ్చరించారు.అదేవిధంగా డబ్బు,మద్యం పంపిణి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.పోలింగ్ పూర్తి అయిన తరువాత పోల్ఢ్ ఈవీఎం లను ఖమ్మం లోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ కాలేజీ వద్దకు తీసుకుని రావాలని సూచించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఐదు మండలాల ఎన్నికల నిర్వహణ సెక్టార్ అధికారులు,ఎంపీడీఓ లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.