ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న ఎన్నికల బృందం

– ఓటర్ల జాబితా పునః పరిశీలన: తహశీల్దార్ లూదర్ విల్సన్
నవతెలంగాణ – అశ్వారావుపేట 
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపద్యంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది.గత ఏడాది కాలంలో తొలగించిన ఓట్లను పునః పరిశీలించాలని అధికారులను ఆదేశించింది.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన అధికారుల బృందం ఒకటి సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ లూధర్ విల్సన్ నేతృత్వంలో తొలగించిన ఓట్లు ఎంత వరకు సమంజసమో పరిశీలించారు. ఓటరు మృతి,ఇతర ప్రాంతాలకు వలస,రెండు కు పైగా ఓట్లు ఉన్న చిరునామా ఆధారంగా ఓట్లు తొలగించిన కారణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాబితా నుండి గతంలో తొలగించిన ఓట్లు నిరాకరణను ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారుల బృందం పునఃపరిశీలన చేస్తుందని తహశీల్దార్ లూధర్ విల్సన్ అన్నారు.