
– జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి సమర్థవంతంగా శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్ శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిఎల్ఎంటి, ఎఎల్ఎంటిల శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావ్వివకుండా సమర్థవంతంగా శిక్షణ అందించాలని అలాగే మాక్ పోల్ శిక్షణ ను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలోని నియోజక వర్గాల్లో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు పూర్తి స్థాయిలో శిక్షణను అందించాలని అన్నారు. ఎన్నికల్లో లోటుపాట్లు లేకుండా నిర్వహణ సిబ్బంది శిక్షణ పైనే ఆధారపడి ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర అవార్డు పొందడం జరిగిందని, ఈ సందర్బంగా మాస్టర్ ట్రైనర్స్ జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిదంగా అసెంబ్లీ ఎన్నికలు సూర్యాపేట జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించటానికి సహకరించిన ఎస్ఎల్ఎంటి, డిఎల్ఎంటి, ఎఎల్ఎంటి ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎస్ఎల్ఎంటి రమేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, డిఎల్ఎంటి , ఎఎల్ఎంటి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.